విస్సన్నపేట: విధి నిర్వహణలో ఉన్న లస్కర్ మండలంలోని చండ్రుపట్ల ఎన్‌ఎస్‌పీ కాలువలో పడి మరణించారు. విస్సన్నపేట ఎన్‌ఎస్‌పీ కార్యాలయంలో లస్కర్‌గా పనిచేసే చిలకమర్తి నాగేంద్ర(45) ఆదివారం ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సోమవారం ఉదయం సాగర్ కాలువలో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు చండ్రుపట్ల వెళ్లి కాలువలో పరిశీలించారు.
మృతుడు నాగేంద్రగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య అనూష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ సక్రు తెలిపారు. నాగేంద్ర ప్రమాదవశాత్తూ కాలువలో పడి మృతిచెంది ఉండవచ్చని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నాగేంద్రకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.


