పెనుగంచిప్రోలు: తిరుపతమ్మ చిన్న తిరునాళ్లలో రెండో రోజు శనివారం రాత్రి గోపయ్యసమేత తిరుపతమ్మ రథోత్సవం వైభవంగా జరిగింది. తొలుత ఉత్సవమూర్తులను అలంకరించిన రథంపై ఉంచారు. రథం ముందు రజకులు, శాలివాహనులు కుంభం పోసిన అనంతరం డప్పు వాయిద్యాలు, మేళతాళాల మధ్య రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈఓ బీహెచ్‌వీఎస్‌ఎన్ కిషోర్‌కుమార్, చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, ఈఈ ఎల్.రమ, పాలకవర్గసభ్యులు బెజవాడ శ్రీనివాసరావు, పాలాది వెంకటరమణ కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రథోత్సవం సాగింది. కార్యక్రమంలో తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మి, ఏఈవోలు ఉమాపతి, తిరుమలేశ్వరరావు, ఏఈ రాజు, చుంచు రమేష్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆదివారం రాత్రి గం.9.05 గంటలకు దివ్య ప్రభోత్సవం జరుగుతుందని ఆలయ ఈఓ తెలిపారు.