ఘనంగా దసరా వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా దసరా వేడుకలు

Oct 14 2024 2:38 AM | Updated on Oct 14 2024 2:38 AM

ఘనంగా దసరా వేడుకలు

ఘనంగా దసరా వేడుకలు

కోనేరుసెంటర్‌: కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయంలో దసరా వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ ఆర్‌. గంగాధరరావు, ఆయన సతీమణి సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని పూజా కార్యక్రమాలు జరిపించారు. అలాగే పోలీసులు నిర్వహించిన ఆయుధ పూజలో పాల్గొన్న ఎస్పీ పోలీసు ఆయుధాలకు పూజ జరిపించారు. పోలీసు వాహనాలకు హారతి పట్టి దిష్టి తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లాలోని పోలీసులకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ దసరా విశిష్టతను సిబ్బందికి వివరించారు. తెలుగు పండుగల పేరిట సంస్కృతీ సంప్రదాయాలలో ప్రత్యేకమైన సందేశాలు ఉంటాయన్నారు. మనిషి తన జీవనానికి అవసరమైన పనిముట్లను దైవంగా భావిస్తూ పూజాధి కార్యక్రమాలు నిర్వహించటం కృతజ్ఞతాభావాన్ని తెలియజేస్తుందన్నారు. విజయాలను చేకూర్చే విజయదశమి పోలీసులతో పాటు ప్రజలందరికీ కుటుంబాలకు విజయాలను అందజేయాలని దుర్గామాతను కోరుకుంటున్న ట్లు తెలిపారు. జిల్లా ఇన్‌చార్జ్‌ అడిషనల్‌ ఎస్పీ ఎస్‌వీడీ ప్రసాద్‌, బందరు డీఎస్పీ సుభాన్‌, స్పెషల్‌బ్రాంచ్‌ సీఐలు రంగనాథ్‌, రమేష్‌, ఆర్‌ఐ సతీష్‌ పాల్గొన్నారు.

కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధపూజ

పాల్గొన్న ఎస్పీ గంగాధరరావు దంపతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement