విజయవాడ అంటే నాకు చాలా ఇష్టం: హనీ రోజ్‌ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ అంటే నాకు చాలా ఇష్టం: హనీ రోజ్‌

May 8 2023 1:18 AM | Updated on May 8 2023 1:38 PM

జ్యోతి వెలిగించి బ్రైడల్‌ కలెక్షన్‌ ప్రారంభిస్తున్న సినీ హీరోయిన్‌ హనీరోజ్‌ - Sakshi

జ్యోతి వెలిగించి బ్రైడల్‌ కలెక్షన్‌ ప్రారంభిస్తున్న సినీ హీరోయిన్‌ హనీరోజ్‌

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): నగరంలోని జైహింద్‌ కాంప్లెక్స్‌ నందు దేవి పవిత్ర గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ షోరూంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రైడల్‌ విభాగాన్ని ఆదివారం సినీ నటి హనీ రోజ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడ నగరం అంటే తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. ఇక్కడ ప్రజలు చూపించే అభిమానం మరువలేదనిదని చెప్పారు.

షోరూంలో బ్రైడల్‌ కలెక్షన్స్‌ అద్భుతంగా ఉన్నాయన్నారు. డైమండ్‌ సెట్‌ ధరించి చూశానని, చాలా బాగా ఉందన్నారు. దేవి పవిత్ర గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ షోరూం లోనే తాను డైమండ్స్‌ కొనుగోలు చేస్తానన్నారు. నగరంలోని మహిళలు షోరూం కు వచ్చి కలెక్షన్స్‌ వీక్షించి కొనుగోలు చేయాలని కోరారు. షోరూం అధినేత రాజేష్‌ మాట్లాడుతూ తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు నూతన మోడల్స్‌, నాణ్యత, మన్నికతో బంగారు, వజ్ర ఆభరణాలను అందిస్తున్నామని పేర్కొన్నారు.

వివాహాది శుభకార్యాల కోసం బంగారు వజ్రాభరణాలు కొనుగోలు చేసే వారికి సమయం కలసి వచ్చే ప్రత్యేక బ్రైడల్‌ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. షోరూం అధినేతలు వి. సుధాకర్‌, వి. జగదీశ్‌, బ్రహ్మేంద్ర, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement