కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట నాయకులు, ప్రజాప్రతినిధుల మధ్య వైరం గల్లీ నుంచి గాంధీ భవన్ దాకా నిరసనలు ఉమ్మడి జిల్లాలో భగ్గుమంటున్న విభేదాలు గాడిన పెట్టేవారే లేక కేడర్‌లో అయోమయం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న పా ర్టీలో అంతర్గత కుమ్ములాటలు బయట పడుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల నుంచి జిల్లా నాయకుల వరకు వారి మధ్య ఐక్యత కొరవడుతోంది. నియోజకవర్గా ల్లో ఒకరికి మించి ఒకరు అన్నట్లుగా గ్రూపు త గాదాలు నడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాలకు గానూ ఖానాపూర్, మంచి ర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌లో మాత్రమే అధికా ర పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా.. మిగతా చోట్ల ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరిన్ని శాసనసభ స్థానాలు గెలుచుకునేలా పనిచేయాల్సి ఉండగా .. గ్రూపు రాజకీయాలతో కేడర్‌లో అయోమయం నెలకొంది.
గాంధీభవన్‌కు పంచాయితీలు
జిల్లా నుంచి పార్టీ పంచాయితీలు రాష్ట్ర నాయకత్వానికి తెలియజేసేలా గాంధీభవన్ వరకు వె ళ్తున్నాయి. ఇటీవల ఉట్నూర్‌లో పార్టీ రాజకీ య వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ ముందే ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి, మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ్‌రెడ్డి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇటీవల ఆదిలాబా ద్ డీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించా లంటూ నరేశ్‌జాదవ్‌పై బోఽథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి అడె గజేందర్ తన అనుచరులతో గాంధీ భవన్‌కు వెళ్లి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు వినతిపత్రం ఇచ్చారు. అంతకుముందు ఆసిఫాబాద్ జిల్లాలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్ర ం సుగుణకు వ్యతిరేకంగా మాజీ డీసీసీ అఽధ్యక్షుడు విశ్వప్రసాద్ అనుచరులు గాంధీ భవన్ ముందే ధర్నా చేశారు. ఇక ఆసిఫాబాద్ ని యోజకవర్గ ఇన్‌చార్జి శ్యామ్‌నాయక్, మాజీ డీసీ సీ అధ్యక్షుడి మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. ఖా నాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మధ్య సఖ్యత లేదు.
మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే
మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, చె న్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ప్ర ధానంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, చెన్నూర్ ఎమ్మెల్యే, మంత్రి వివేక్ వెంకటస్వామి వర్గాలుగా ఉన్నాయి. ఇటీవల మంచిర్యాల నియోజకవర్గ పరి ధిలోనే మంతెన జగన్‌మోహన్‌రావు ఎ మ్మెల్యేకు వ్యతిరేకంగా ఓ గ్రూపు కడుతున్నారు. అసంతృప్త కార్పొరేటర్లు, కౌన్సిల ర్లు, గ్రామ, మండల స్థాయి నాయకుల ను కూడగడుతున్నారు. ప్రేమ్‌సాగర్‌రా వు, మంత్రి వివేక్ వర్గాల మధ్య వైరం ముదురుతోంది. ఇటీవల పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటన ను నిరసిస్తూ దండేపల్లి మండలం గూడె ంలో ఎమ్మెల్యే వర్గీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
సరిదిద్దేవారేరి?
ఉమ్మడి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్సీ అధికార పార్టీలో ఉన్నా రు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం అవుతున్నారు. ఇక పార్టీ వ్యవహారాల్లో ఆయన జోక్యం తక్కువగానే ఉంటోంది. దీంతో ఎవరికి వారే అన్నట్లు సాగుతోంది. ఓ వైపు ఉమ్మడి జిల్లా నుంచి అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నా వారికి నామినేటెడ్ పదవుల్లో చోటు దక్కడం లేదు. జిల్లా స్థాయిలో భర్తీ కావడంతో పార్టీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది. పదేళ్ల తర్వాత అ ధికారంలోకి వచ్చినా జెండా మోసిన నాయకులు, కార్యకర్తలకు ఏం ఒరగడం లేదనే వి మర్శలు వస్తున్నాయి. వీటన్నింటిని చక్కబె ట్టి గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలనే అధిష్టానం ఆశలకు క్షేత్రస్థాయి నాయకుల మధ్య అనైక్యత అడ్డంకిగా మారాయి.


