ఆసిఫాబాద్: జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణ కు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె.హరిత అన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ఈ ఏడాది 3 గంజాయి కేసులు నమోదు, గంజాయి సాగు చేసిన 36 మంది రైతులకు రైతుబంధు నిలిపివేసినట్లు తెలిపారు. సమావేశంలో ఆర్డీవోలు లోకేశ్వర్ రావు, కిష్టయ్య, డీఎస్పీ అశోక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చాంబర్‌లో అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వేను జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సర్వే ల్యాండ్ రికార్డ్ ఏడీ వినయ్ కుమార్, మండల సర్వేయర్లు పాల్గొన్నారు.
విద్యార్థుల హాజరు శాతం పెంచాలి
ఆసిఫాబాద్‌రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థు ల హాజరుశాతం పెంచాలని కలెక్టర్ కె.హరిత అ న్నారు. సోమవారం కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, జిల్లా విద్యాధికారి సచ్చిదానంద చారితో కలిసి జిల్లాలోని ఎంఈవో, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం, సీఆర్‌పీలకు జూమ్ మీటింగ్ నిర్వహించారు.
విముక్తి జాతుల అభివృద్ధికి చర్యలు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలోని విముక్తి జాతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.హరిత అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తింపజేయడంతో పాటు పిల్ల లకు విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి నదీమ్, గిరిజన సంక్షేమాధికారి అంబాజి, తదితరులు పాల్గొన్నారు.


