ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా పరిధిలోని వివిధ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతి లో నిర్వహించాలని పలువురు రైతులు, స భ్యులు సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహకార చట్టం ప్రకారం ప్రత్యక్ష ఎన్నికల ద్వారా పాలకవర్గాలను ఎన్నుకోవాల్సి ఉండగా, నామినేషన్‌ల పద్ధతి లో పాలకవర్గాలను ఏర్పాటు చేసే ప్ర యత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్య క్తం చే శారు. సహకార చట్టం 1964లోని నిబంధన ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని, రై తులు, పాక్స్ సభ్యులకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో అలీబి న్ అహ్మద్, పెంటయ్య, శివాజీ, శ్రీనివాస్, తిరుపతి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.


