గత పాలకుల నిర్లక్ష్యంతో కుంటుపడిన అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

గత పాలకుల నిర్లక్ష్యంతో కుంటుపడిన అభివృద్ధి

Jun 17 2026 11:53 PM | Updated on Jun 17 2026 11:53 PM

● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు

దహెగాం: గత పాలకుల నిర్లక్ష్యంతోనే నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద బుధవారం ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పెంచికల్‌పేట్‌, దహెగాం మధ్యలో పెద్దవాగు వద్ద వంతెన, అప్రోచ్‌ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పనులు పూర్తయితే రెండు మండలాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాపర్తి జయలక్ష్మి, సహకార సంఘం చైర్మన్‌ తిరుపతిగౌడ్‌, వైస్‌ చైర్మన్‌ ధనుంజయ్‌, తహసీల్దార్‌ మునవార్‌ షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలి

కాగజ్‌నగర్‌టౌన్‌/పెంచికల్‌పేట్‌: అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. పెంచికల్‌పేట్‌ మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం 40 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రవీందర్‌, ఎంపీడీవో సంతోష్‌రెడ్డి, సర్పంచులు రాంచందర్‌, రవీందర్‌, ఉస్మాన్‌, రాజేశ్వరి, కృష్ణవేణి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement