ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం

Jun 16 2026 12:28 AM | Updated on Jun 16 2026 12:28 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెరీర్‌ గైడెన్స్‌, ప్లేస్‌మెంట్‌ సెల్‌ ఆ ధ్వర్యంలో సోమవారం పోలీస్‌ కానిస్టేబుల్‌, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రిన్సి పాల్‌ శ్రీదేవి మాట్లాడుతూ ఇంటర్‌ ఉత్తీర్ణులై న విద్యార్థులకు పోటీ పరీక్షలపై అవగాహన కలిగిస్తామన్నారు. పోలీస్‌, ఫారెస్ట్‌ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు రానున్నందున విద్యార్థులకు నెల రోజులపాటు నిష్ణాతులైన అధ్యాపకులతో ఉచిత శిక్షణ అందిస్తామని తెలిపారు. కెరీర్‌ గైడెన్స్‌ సెల్‌ ఇన్‌చా ర్జి డాక్టర్‌ లక్ష్మీనరసింహం మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో అత్యంత కీలకమైన జనరల్‌ స్టడీస్‌తోపాటు జనరల్‌ ఇంగ్లిష్‌, ఆర్థమెటిక్స్‌ రిజనీంగ్‌ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దాదాపు 200 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో అకాడమిక్‌ కోఆర్డినేటర్‌ జనార్దన్‌, క్యూసీ కోఆర్డినేటర్‌ శారద, అధ్యాపకులు రాజేశ్వర్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ దత్తాత్రేయ, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement