వేగంగా ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

వేగంగా ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం

Jun 16 2026 12:28 AM | Updated on Jun 16 2026 12:28 AM

● అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌

ఆసిఫాబాద్‌అర్బన్‌: ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరి స్తామని అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) డేవిడ్‌, డీఆర్‌వో దాసరి వేణుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేయాలని కౌటాల మండలం మొగడ్‌దగడ్‌ గ్రామానికి చెందిన దరఖాస్తు చేసుకున్నాడు. రైతుబీమా మంజూ రు చేయాలని రెబ్బెన మండలం నవేగాంకు చెందిన శకుంతల వి న్నవించింది. దివ్యాంగుడినైన తనకు ఎలక్ట్రికల్‌ ట్రై సైకిల్‌ ఇప్పించాలని కాగజ్‌నగర్‌ పట్టణం పోచమ్మ బస్తీకి చెందిన రాజేశ్వర్‌ కో రాడు. ప్రభుత్వం ఇచ్చిన లావుణి పట్టా భూమి సాగుకు అటవీ శాఖ అడ్డుపడుతుందని, న్యాయం చేయాలని దహెగాం మండలం ఐనం గ్రామానికి చెందిన దుర్గాగౌడ్‌ కోరాడు. దహెగాం మండలం ఐనం గ్రామంలో వంగిన విద్యుత్‌ స్తంభాలను సరిచేయాలని సర్పంచ్‌ ప్రశాంత్‌ దరఖాస్తు అందించారు. రెబ్బెన మండలం కై రిగాం పంచాయతీ పరిధిలోని ఎడవెల్లి గ్రామానికి చెందిన రైతులు తమ పంట పొలాలకు వట్టివాగు నీరందించాలని విన్నవించారు. గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి సీటు ఇప్పించాలని కౌటాల మండలం బాలెపల్లికి చెందిన సాయిప్రసాద్‌ అర్జీ అందించాడు. బ్యాంకు రుణం మంజూరు చేయాలని దహెగాం మండలం కొత్మీర్‌కు చెందిన రెడ్డి రాజయ్య వేడుకున్నాడు.

పెరాలసిస్‌తో పనిచేయలేకపోతున్నా

తొమ్మిది సంవత్సరాల క్రితం పెరాలసిస్‌ రావడంతో ఏ పని చేసుకోలేకపోతున్నాను. మాది పేద కుటుంబం కావడంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. పింఛన్‌ మంజూరు చేస్తే ఇతరులపై ఆధారపడకుండా ఆసరాగా ఉంటుంది.

– పప్పు మండల్‌, రవీంద్రనగర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement