కాగజ్‌నగర్‌టౌన్: ఈ నెల 16న పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రథమ మ హాసభలు నిర్వహించనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్‌కుమార్ తెలిపారు. మండలంలోని చింతగూడ గ్రామంలో ఉపాధిహామీ పనులకు వెళ్లిన కూలీలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి ఉపాధిహామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కొత్త చట్టం అమలుతో గ్రామీణ ప్రాంతాల్లో పనులు తగ్గి వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహాసభలకు ఉపాధిహామీ కూలీలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.


