ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. వాతావరణం చల్ల బడుతుంది. వర్షం కురిసే అవకాశముంది.
‘ప్రధాని చొరవతోనే ప్రజాసంక్షేమం’
కాగజ్‌నగర్‌టౌన్: ప్రధాని నరేంద్రమోదీ చొ రవతోనే రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్‌బాబు పేర్కొన్నారు. దేశంలో 12 ఏళ్ల పాలనలో మోదీ పూర్తిగా ప్రజాసేవకు అంకితమయ్యారని తెలిపారు. శనివారం ప ట్టణంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ దేశాన్ని అత్యధి క సంవత్సరాలు పాలించిన ఘనత సాధించి రికార్డు సృష్టించారని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్‌యోజన, కిసాన్ సమ్మాన్ నిఽధి, ఉ జ్వల యోజన, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాలతో అర్హులైన ప్రతీ ఒక్కరికి కేంద్ర ప్ర భుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. పుష్కర కాలంలో గ్రామీణ స డక్ యోజన కింద జాతీయ రహదారుల ని ర్మాణం పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. పైసలు లేని ప్రజాపాలనతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దండగగా మారిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను వి మర్శించడమే పనిగా పెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు.
ఆర్మీకి విద్యార్థుల ఎంపిక
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డి గ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతు న్న విద్యార్థులు మాండోరె శంకర్, గౌత్రే క ల్యాణ్, కమినవేని సతీశ్ ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్‌గా ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శ్రీదేవి, కెరీర్ గైడెన్స్ సెల్ ఇన్‌చార్జి డాక్టర్ లక్ష్మీనరసింహులు శనివారం ఓ ప్రకటనలో తెలిపా రు. గతేడాది ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ నియామకాల ఎంపిక పక్రియలో పాల్గొని రాత పరీక్ష, శారీరక పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఇటీవల నియామక ఉత్తర్వులు అందుకున్నట్లు పేర్కొన్నారు. వీరిని కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.


