మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

Jun 12 2026 5:45 AM | Updated on Jun 12 2026 5:45 AM

వాంకిడి: ప్రజలు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ అశోక్‌ అన్నారు. మండలంలోని బనార్‌కొసార, చిన్న వాంకిడి గ్రామాల్లో గురువారం డాగ్‌ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై పలు విషయాలపై అవగాహన కల్పించారు. గంజాయి విక్రయం, వినియోగంపై జిల్లా పోలీస్‌ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గంజాయి వాడకం, చెట్ల పెంపకం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. యువత చదువు, క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లి జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో సీఐ వేణుగోపాల్‌, ఎస్సై మహేందర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement