ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని డిపో నుంచి మండలాలకు పాఠ్యపుస్తకాలు పంపి ణీ చేస్తున్నట్లు జిల్లా నోడల్ అధికారి సుభాష్ తెలిపారు. గురువారం స్థానిక మోడల్ స్కూల్‌లోని డిపోను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 15న ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా, అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు సకాలంలో చే రేలా ఎంఈవోలు చర్యలు తీసుకోవాలని సూ చించారు. ఇప్పటివరకు జిల్లాకు పార్ట్– 1కు సంబంధించిన 90,880 పుస్తకాలు వచ్చాయ ని తెలిపారు. డిపో మేనేజర్ ప్రకాశ్, సీఆర్‌పీ నగేశ్ తదితరులు పాల్గొన్నారు.


