వాంకిడి: నాలుగు వరుసల జాతీయ రహదారి– 363 నిర్మాణ సమయంలో భారీ వాహనాల రాకపోకలతో తమ గ్రామ రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని.. తిరిగి నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన కంపెనీ వారు ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని మండలంలోని సోనాపూర్ గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. గణేష్‌పూర్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి కంపెనీ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. 2021లో హైవే నిర్మాణానికి గ్రామం మీదుగా భారీ వాహనాలతో మట్టిని తరలించడంతో బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని వాపోయారు. తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే గణేష్‌పూర్ వద్ద బస్టాండ్ నిర్మించాలని, సర్వీస్ రోడ్డు, సైడ్ డ్రెయిన్ పనలు పూర్తి చేయాలని కోరారు.


