వాంకిడి: సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు నిర్ణయించి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఈ నెల 20న తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు బండె హరీష్, తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా నాయకుడు దుర్గం సందీప్ పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ మండోకార్‌వాడ, ఇందాని ఎంపీపీఎస్ పాఠశాలలో కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాపర్తి నవీన్, సాయికుమార్, మహేందర్, రాజలింగు, అజయ్, విజయ్‌బాబు, గిర్మాజీ, శ్వేత, అమరేశ్వరి, తిరుమల, తదితరులు పాల్గొన్నారు.


