శిక్షణలో జిల్లా అధికారులు
ఆసిఫాబాద్‌రూరల్: జాతీయ విద్యా శిక్షణ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ వారు హోలీస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్‌పై రెండు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణకు గురువారం జిల్లా విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. విద్యాశాఖ జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులెట్టి శ్రీనివాస్, కాగజ్‌నగర్ ఎంఈవో ప్రభాకర్, ఆస్పిరేషనల్ జిల్లా కోఆర్డినేటర్ బాలరాజ్ రాజారాం శిక్షణలో పాల్గొన్నారు. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాల్లో వెనుకబాటుకు కారణాలు, పరిష్కార మార్గాలపై అవగాహన కల్పించారని వారు తెలిపారు.


