జిల్లా కార్యవర్గం ఎన్నిక
కెరమెరి: జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన సమావేశంలో క్లస్టర్ రిసోర్స్‌పర్సన్(తెలంగాణ)ల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రత్నం శివరాం(చింతలమానెపల్లి), జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నం రాజేశ్(తిర్యాణి)ను ఎన్నుకున్నామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టా దేవిందర్ తెలిపారు. పూర్తి కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 22న జరిగే సీఆర్పీల ఆత్మీయ సమ్మేళనానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
అన్నం రాజేశ్
రత్నం శివరాం
జిల్లా కార్యవర్గం ఎన్నిక


