రోడ్డు నిర్మాణం చేపట్టాలని ధర్నా
కాసిపేట: రోడ్డు నిర్మాణం చేపట్టాలని కాసిపేట గ్రామస్తులు శనివారం ధర్నా చేపట్టారు. మండల కేంద్రంలో ప్రధాన రోడ్డు అధ్వానంగా మారిందంటూ భారీ వాహనాలను అడ్డుకున్నారు. మందమర్రి వద్ద ఉన్న టోల్‌ప్లాజాను తప్పించుకునే క్రమంలో భారీ లోడ్‌తో ఓరియంట్ సిమెంట్ కంపెనీ, సింగరేణి వాహనాలు కాసిపేట నుంచి బైపాస్ గుండా వెళ్లడంతో ఆర్‌అండ్‌బీ రోడ్డు అధ్వానంగా మారిందన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో ఓపెన్‌కాస్ట్ మట్టిని రోడ్డుపై పోయడంతో దుమ్ముధూళి ఇళ్లలోకి వస్తోందన్నారు. ఆర్‌అండ్‌బీ, సింగరేణి అధికారులు స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
అక్రమంగా చెట్లు నరికిన ఇద్దరు రిమాండ్
ఇంద్రవెల్లి: అక్రమంగా చెట్లు నరికిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు ఎఫ్‌ఆర్వో సంతోష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఇంద్రవెల్లి అటవీశాఖ దనోరా(బి) సెక్షన్ పరిధి కొయల్పాండ్రి సమీపంలో శుక్రవారం సాయంత్రం డొంగర్‌గాం గ్రామానికి చెందిన రాథోడ్ ప్రవీణ్, చవాన్ మున్నలు అక్రమంగా చెట్లను నరికివేస్తూ పట్టుబడ్డారు. కొయల్పాండ్రి బీట్‌లో కంపార్ట్‌మెంట్ నెంబర్ 387లో మొత్తం 117 చెట్లను అక్రమంగా నరికినట్లు నిర్ధారించి అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. శనివారం ఉట్నూర్ జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ మౌనిక ఎదుట హాజరపర్చగా రిమాండ్ చేసినట్లు తెలిపారు. డిప్యూటీ ఆర్‌వో నరేష్,ఎఫ్‌బివో జంగు పాల్గొన్నారు.
రోడ్డు నిర్మాణం చేపట్టాలని ధర్నా


