కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ అభ్యర్థులు, కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి కోరారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్‌కు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల గుండాలు తల్వార్లు, కత్తులతో బీజేపీ అభ్యర్థులు, కార్యకర్తలపై దాడులకు దిగే ప్రయత్నం చేశారన్నారు. బీజేపీ అభ్యర్థి డేగ బాపు, హైటెక్‌సిటీలో అభ్యర్థి సురభి రవి, కుటుంబసభ్యులను కాంగ్రెస్ నాయకుడు కిషోర్‌రావు బెదిరింపులకు దిగారన్నారు. హమాలివాడ 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్ తన అనుచరులతో బీజేపీ నాయకులు ఆకుల సంతోష్, సాతిని రాజును బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. దొరగారిపల్లెలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు.


