● ధూపదీప నైవేద్యాలకు అందని డబ్బులు ● ఇబ్బందుల్లో అర్చకులు | - | Sakshi
Sakshi News home page

● ధూపదీప నైవేద్యాలకు అందని డబ్బులు ● ఇబ్బందుల్లో అర్చకులు

Feb 15 2026 6:58 AM | Updated on Feb 15 2026 6:58 AM

● ధూపదీప నైవేద్యాలకు  అందని డబ్బులు ● ఇబ్బందుల్లో అర్చక

● ధూపదీప నైవేద్యాలకు అందని డబ్బులు ● ఇబ్బందుల్లో అర్చక

● ధూపదీప నైవేద్యాలకు అందని డబ్బులు ● ఇబ్బందుల్లో అర్చకులు

ఆలయ అభివృద్ధిపై పట్టింపేది ?

చెన్నూర్‌రూరల్‌: చెన్నూర్‌ మండలంలోని సుద్దాల గ్రామంలోని ఎంతో చరిత్ర ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధిపై పట్టింపు లేకుండా పోతోంది. ఇక్కడ ధూప, దీప నైవేద్యాలకు డబ్బులు అందని పరిస్థితి. దీంతో అర్చకులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలయం లోపల వర్షపునీరు ఊరుస్తుంది. చర్యలు చేపట్టాల్సిన ఉన్న సంబంధిత శాఖల అధికారులు తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. దాతలు ముందుకు రావాలని, దేవాదాయ, ధర్మాధాయశాఖ అధికారులు పట్టించుకుని ఆలయాన్ని అభివృద్ధి చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు.

చరిత్ర ఇలా..

గ్రామానికి వచ్చిన ఒక ముని వాగుఒడ్డున చింతచెట్టు కింద సీతారాములు, లక్ష్మణుడు, అంజనేయస్వామి రాతి విగ్రహాలను బయటకు తీసినట్లు చరిత్ర చెబుతోంది. అక్కడ వాగు ఒడ్డున ఒక పందరి వేసి విగ్రహాలు ప్రతిష్ఠించారు. పట్టణానికి చెందిన రామగుడు కిష్టయ్య అనే భక్తుడి కలలో శ్రీరాముడు కనిపించి తనకు ఆలయం నిర్మించాలని చెప్పగా, గ్రామస్తుల సహాయంతో డంగు సున్నంతో 1910లో మందిరం నిర్మింపజేశారు. సీతా, రామ, లక్ష్మణుడు, ఆంజనేయుల పంచలోహ విగ్రహాలు తెప్పించి ప్రతిష్ఠించారు. అప్పుడు ఆయన వెలిగించిన అఖండ దీపం ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. 2004లో పంచలోహ విగ్రహాలన్నీ చోరీకి గురయ్యాయి. పోలీసులు విచారణ చేపట్టిన వాటి జాడ తెలియలేదు. తిరిగి మళ్లీ కాంస్య విగ్రహాలను ప్రతిష్ఠించారు. ప్రతీరోజు ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తుంటారు. ఏటా ఇక్కడ శ్రీరామనవమి పర్వదినాన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహిస్తారు. ఏడు రోజలపాటు నాగవెల్లి తదితర ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. తాము కోరిన కోర్కెలు తీరాలని, కొబ్బరికాయలు ముడుపులు కడితే నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement