ముగ్గురు దొంగలు పట్టివేత
ఖానాపూర్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లోని పెంబి స్టాఫ్ వద్ద ముగ్గురు మహిళ దొంగలను కండక్టర్, ప్రయాణికులు శనివారం పట్టుకున్నారు. బస్‌లో ఉన్న పెంబి గ్రామానికి చెందిన పర్వతాల నీల వద్ద రూ.3700, ఎడ్ల నర్సవ్వ వద్ద రూ.2650, మరో మహిళ వద్ద రూ. వెయ్యి, బ్యాగులు, కవర్ కట్‌చేసి చోరీకి పాల్పడ్డారు. తమ బ్యాగుల్లో డబ్బులు లేవని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, చోరీకి పాల్పడిన ముగ్గురు మహిళలను కండక్టర్, ఇతర ప్రయాణికులు పట్టుకున్నారు. మరో మహిళ పరారీ అయ్యారు. చోరీ చేసిన మహారాష్ట్రకు చెందిన శ్రీవాణి, విజేత, రాణికి దేహశుద్ధి చేసి ఆర్టీసీ కంట్రోల్ రూంలో ఉంచి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని దొంగలను వాహనంలో పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. కాగా, బస్టాండ్‌లో కొన్నినెలలుగా వరుసచోరీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈనెల 11న బస్టాండ్‌లో ఆదిలాబాద్‌కు చెందిన స్వామి విలువైన సెల్‌ఫోన్ చోరీకి గురైంది.
చెరువులో పడి ఒకరి మృతి
ఆదిలాబాద్‌రూరల్: బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరు మృతిచెందినట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని తంతోలి గ్రామానికి చెందిన చింతల్‌వార్ శ్రీరాం (25) శుక్రవారం బహిర్భూమికని చెరువు వైపు వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఆచూకీ కోసం గాలించారు. చెరువు వద్ద బైక్ ఉండడంతో గమనించి చెరువులో చూడగా మృతదేహం లభ్యమైంది. తండ్రి రాజేశ్వర్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కాపర్ వైర్ చోరీ
బాసర: మండలంలోని టాక్లి, కిర్గుల్(బి) గ్రామ పరిధిలోని పంట చేల నుంచి గుర్తుతెలియని దుండగులు శనివారం ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్ చోరీ చేశారు. బాసర ఏఈ సి నాయక్, రైతులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఆర్టీసీ బస్సు టైర్‌లో పొగలు
లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బస్సు టైర్‌లో పొగలు వచ్చాయి. శనివారం మధ్యాహ్నం మంచిర్యాల నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక టైర్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. టైర్ లైనర్లు పట్టుకోవడంతో పొగలు వచ్చాయని, వెంటనే ప్రయాణికులకు దింపి వేరే బస్సులో పంపించినట్లు డ్రైవర్ తెలిపారు. బస్టాండ్ వద్ద బస్సును నిలిపివేశారు.
ముగ్గురు దొంగలు పట్టివేత


