జంగుబాయి క్షేత్రంలో జన జాతర
కెరమెరి(ఆసిఫాబాద్): జంగుబాయి ఉత్సవాలు శనివారం ముగియనున్నాయి. ఒక్కరోజే సమయం ఉండడంతో శుక్రవారం కెరమెరి మండలం మహరాజ్‌గూడ గ్రామ సమీపంలో కొలువుదీరిన జంగుబాయి క్షేత్రానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. తెలంగాణ ఆదివాసీలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సుమారు 260 మేళాలు జంగుబాయిని దర్శించుకున్నట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. శుక్రవారం నాటికి 1.10 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు కమిటీసభ్యులు సలాం శ్యాంరావు, పుర్క బాపూరావు, కొడపు జాకు, మరప బాజీరావు తెలిపారు.
నేడు దేవతల శుద్ధీకరణ..
నేడు మధ్యాహ్నం 2 గంటలకు కపైల్ప. సిద్దికస, దారికస, విజ్జకస, టొప్లకస ప్రాంతాల్లో గల పవిత్ర నదుల్లో నుంచి గంగాజలాన్ని తీసుకొచ్చి దేవతా విగ్రహాలను శుద్ధిచేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలోని కెస్లాపూర్ గ్రామంలో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న నాగోబా పూజ నేపథ్యంలో శనివారం రాత్రి జంగుబాయి కెస్లాపూర్‌కు చేరనున్నారు. దేవతల శుద్ధి కార్యక్రమంతో జంగుబాయి ఉత్సవాలు ముగియనున్నాయి.
జంగుబాయి క్షేత్రంలో జన జాతర
జంగుబాయి క్షేత్రంలో జన జాతర


