‘స్కూల్ యూత్ ఐడియాథాన్’కు ఎంపిక
ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు తమ ఆలోచనలతో అదరగొట్టారు. వినూత్న ప్రాజెక్టుతో స్కూల్ యూత్ ఐడియాథాన్ పోటీలకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఐమానుద్దీన్ (ఆదిలాబాద్), పారస్ (నిర్మల్), వారిశ్ రాజ్ (మంచిర్యాల) ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నారు. ఈ పోటీలో సుమారు మూడు లక్షల మంది వరకు ప్రాజెక్టులను ప్రదర్శించగా, దేశవ్యాప్తంగా ఉత్తమమైన 100 ఎంపిక చేశారు. అందులో వీరి ప్రాజెక్టు ఒకటిగా ఎంపికై ంది. లెమన్ గ్రాస్‌తో పేపర్ తయారీ చేసే వినూత్నమైన విధానాన్ని చక్కగా వివరించారు. దీంతో వీరు ఈ నెల 18న ఐఐటీ ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయస్థాయి ప్రదర్శనలో పాల్గొని, తమ ప్రాజెక్టును ప్రదర్శించనున్నారు. జాతీయస్థాయికి ఎంపిక కావడంపై తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు.


