ఘనంగా ఈస్టర్‌ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ఈస్టర్‌ వేడుకలు

Apr 21 2025 8:03 AM | Updated on Apr 21 2025 8:03 AM

ఘనంగా

ఘనంగా ఈస్టర్‌ వేడుకలు

కౌటాల(సిర్పూర్‌): జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం ఈస్టర్‌ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. కౌటాల మండల కేంద్రంతోపాటు విజయనగరం, యాపలగూడ, శివలింగాపూర్‌, సదాశివపేట గ్రామాల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విజయనగరం చర్చిలో ఫాదర్‌ సీజో, యాపలగూడలో ఫాదర్‌ శేరిన్‌, కౌటాలలో ఫాదర్‌ టామ్‌, సదాశివపేటలో పాస్టర్‌ శ్రీనివాస్‌, మార్కెట్‌ ఏరియాలో పాస్టర్‌ శాంతికుమార్‌ ఈస్టర్‌ సందేశం అందించారు. శివలింగపూర్‌ చర్చిలో పాస్టర్‌ సువార్త రాజన్న మాట్లాడుతూ యేసు క్రీస్తు శిలువపై చనిపోయి ఆదివారం పునరుత్థానంగా మరణాన్ని జయించిన సందర్భంగా ఈస్టర్‌ వేడుకలు జరుపుకొంటామని తెలిపారు. యేసు క్రీస్తు చూపిన మార్గంలో క్రైస్తవులు నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం భక్తులుకు ప్రేమవిందు(అన్నదానం) నిర్వహించారు.

ఘనంగా ఈస్టర్‌ వేడుకలు1
1/1

ఘనంగా ఈస్టర్‌ వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement