ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి

Apr 8 2025 7:15 AM | Updated on Apr 8 2025 7:15 AM

ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి

కాగజ్‌నగర్‌రూరల్‌: పాలిసెట్‌ ఉచిత శిక్షణ త రగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీదేవి అన్నారు. పట్టణంలోని డీఆర్‌ఎస్‌ భవనంలో సోమవారం ఉచిత పాలిసెట్‌ కోచింగ్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రిన్సిపాల్‌ మా ట్లాడుతూ తక్కువ ఖర్చుతో పాలిటెక్నిక్‌ విద్య అభ్యసించవచ్చని, ఇది భవిష్యత్తులో ఇంజినీరింగ్‌ రెండో ఏడాదిలో ప్రవేశానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఉద్యోగ అవకాశాల పరంగా కూడా పాలిటెక్నిక్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. బెల్లంపల్లి పాలిటెక్నిక్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ రామదాసు మా ట్లాడుతూ సాఫ్ట్‌వేర్‌, ఇరిగేషన్‌, పబ్లిక్‌ హెల్త్‌, రైల్వే, ఎయిర్‌లైన్స్‌, ట్రాన్స్‌పోర్టు, గనుల శాఖ లలో పాలిటెక్నిక్‌ విద్యార్థతతో ఉద్యోగావకా శాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్‌ కటుకం మధుకర్‌, కోచింగ్‌ కోకన్వీనర్‌ వాసాల ప్రభాకర్‌, ఎంఈవో వేణుగోపాల్‌, డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ లక్ష్మీనరసింహం, ప్రధానోపాధ్యాయులు సత్యనా రాయణ, రవీందర్‌, చంద్రశేఖర్‌, వెంకటరా జం, సాబీర్‌, శ్రీశైలం, తిరుపతయ్య, శ్యాంసుందర్‌, త్రివేణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement