పేదల అభ్యున్నతికి కృషి
కాగజ్‌నగర్‌రూరల్: పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. కా గజ్‌నగర్ మండలం ఊట్‌పల్లి గ్రామంలో గిరిజను డు మర్సుకోల లింగు ఇంట్లో సోమవారం ఎమ్మెల్యే హరీశ్‌బాబు, అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. ఎమ్మెల్సీ మా ట్లాడుతూ రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం అంది స్తున్న సన్నబియ్యం సద్వినియోగం చేసుకోవాలన్నా రు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్‌బాబు మాట్లాడు తూ సన్నబియ్యం పథకానికి కేంద్ర ప్రభుత్వం 80 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం నిధులు ఇస్తుందని తెలిపారు. సన్నబియ్యాన్ని రెండు, మూడు నెలలు పాతబడిన తర్వాత వండుకుంటే ముద్దయ్యే అవకాశం తక్కువని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


