‘రానున్న రోజుల్లో బీజేపీదే అధికారం’
ఆసిఫాబాద్‌అర్బన్: రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వన్ నేషన్– వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వర్‌రావు, మాజీ ఎంపీపీ మల్లికార్జున్, మండల అధ్యక్షులు సుంకరి పెంటయ్య, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మాటూరి జయరాజ్, నాయకులు ప్రసాద్‌గౌడ్, శ్రీకాంత్, దీపక్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్‌రూరల్: పట్టణంలో ఆదివారం బీజేపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్‌సిల్క్‌కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే హరీశ్‌బాబు పార్టీ జెండా ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల పోరాటాలతో బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ, జిల్లా కోశాధికారి అరుణ్‌లోయా, నాయకులు పాల్గొన్నారు.


