కౌటాల: కాంగ్రెస్‌తోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకా లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాను న్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలన్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని, రా జ్యాంగాన్ని కాపాడాలని జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ సిడాం గణపతి, మాజీ ఎంపీపీలు వి శ్వనాథ్, నానయ్య, నాయకులు తిరుపతి, రవీందర్‌గౌడ్, గట్టయ్య, పోశం, భీంరావ్, సోమయ్య, బండు, కుశబ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
క్రీడల్లో గెలుపోటములు సహజం
క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడలతో బంగారు భవిష్యత్ ఉంటుందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న కౌటాల ప్రిమియర్ లీగ్ క్రికెట్ పోటీలు సోమవారం ముగిశాయి. ఫైనల్ మ్యాచ్‌ను ఆయన ప్రారంభించారు. మొదటి బహుమతి గేమ్ ఛేంజర్ జట్టుకు రూ.లక్ష, ద్వితీయ బహుమతి ఎస్‌ఎన్‌టీఎన్ జట్టుకు రూ. 50 వేల నగదు అందజేశారు. కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం, మాజీ జెడ్పీ చైర్మన్ సిడాం గణపతి, కౌటాల సీఐ ముత్యం రమేశ్, మాజీ ఎంపీపీలు బసర్కార్ విశ్వనాథ్, డుబ్బుల నానయ్య, ఎంపీడీవో కోట ప్రసాద్, ఎస్సై మధుకర్, నాయకులు తిరుపతి, రవీందర్‌గౌడ్, అజ్మత్, సత్యనారాయణగౌడ్, విలాస్‌గౌడ్, అశోక్, ఉమాపతి, పవిత్ర, ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ దండె విఠల్


