ఏదీ ‘చెత్త’శుద్ధి? | - | Sakshi
Sakshi News home page

ఏదీ ‘చెత్త’శుద్ధి?

Mar 25 2025 12:09 AM | Updated on Mar 25 2025 12:09 AM

ఏదీ ‘

ఏదీ ‘చెత్త’శుద్ధి?

● మున్సిపాలిటీల్లో మొక్కుబడిగా పారిశుధ్య పనులు ● ఒకే వాహనంలో తడి, పొడి చెత్త.. ● జిల్లా కేంద్రంలో అలంకార ప్రాయంగా సెగ్రిగేషన్‌ షెడ్‌

ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌అర్బన్‌: రాష్ట్రంలోని ప్రతీ గ్రామం, పట్టణం పరిశుభ్రంగా ఉండాలనే సంకల్ప ంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తడి, పొడి చెత్త డంపింగ్‌ యార్డు ఏర్పాటు జిల్లా కేంద్రంలో కార్యరూపం దాల్చడం లేదు. ఫలితంగా పట్టణంలోని జాతీయ రహదారి పక్కన డంపింగ్‌ యార్డులో రూ.2.5 లక్షలతో నిర్మించిన సెగ్రిగేషన్‌ షెడ్‌ అలంకారప్రాయంగా మారింది. గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా ప్రతీకాలనీని శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో నాలుగేళ్ల క్రితం గత ప్రభుత్వం సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మేజర్‌ గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయినప్పటికీ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో ఈ పథకం అమలుకావడం లేదు. కాలనీల్లో తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాల్సి ఉండగా మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బంది ఒకే వాహనంలో తడి, పొడి చెత్త సేకరిస్తున్నారు.

6 చెత్త సేకరణ వాహనాలు

జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో సుమారు 30 వేలకు పైగా జనాభా, 20 వార్డులు, ఆరువేలకు పైగా గృహాలున్నాయి. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీకి 6 చెత్త సేకరణ వాహనాలు, 3 ట్రాక్టర్లు ఉన్నాయి. ప్రతీరోజు సుమారు 10 టన్నుల చెత్త వెలువడుతుంది. రెండు మూడు రోజులకోసారి కాలనీల్లో వాహనాల ద్వారా చెత్త సేకరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోజుల తరబడి వాహనాలు రాకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది.

లోపిస్తున్న పారిశుధ్యం

జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో పలు కాలనీల్లో పారిశుధ్యం లోపిస్తోంది. పట్టణంలోని కొన్ని కాలనీల్లో నెలల తరబడి రోడ్లు ఊడ్వడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. గతంలో రెండు రోజులకోసారి చెత్త బండి కాలనీలకు వస్తుండగా ప్రస్తుతం నాలుగు రోజులకోసారి వస్తున్నట్లు పేర్కొంటున్నారు. నాలుగేళ్ల క్రితం పగిలిన మిషన్‌ భగీరథ పైప్‌ లైన్‌కు మరమ్మతు చేపట్టడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమలుకు నోచుకోని సెగ్రిగేషన్‌ షెడ్‌

జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో సెగ్రిగేషన్‌ షెడ్‌లో వర్మీకంపోస్టు తయారీలో జాప్యం జరుగుతోంది. పట్టణంలోని జాతీయ రహదారి పక్కనే ప్రభుత్వ భూమిలో ఉన్న డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు గతంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చెత్త సేకరణకు ఇంటింటికీ రెండు వేర్వేరు డబ్బాలను పంపిణీ చేశారు. చెత్తను డబ్బాల్లో సేకరించి సెగ్రిగేషన్‌ ప్లాంట్‌కు తరలించి సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగిస్తారు. తడి చెత్తను వర్ని కంపోస్టు ప్లాంట్‌లో మూడు నెలల పాటు నిల్వ ఉంచి ఎరువుగా మార్చి రైతులకు విక్రయిస్తే మున్సిపాలిటీకి అదనపు ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి. సెగ్రిగేషన్‌ షెడ్‌, డంపింగ్‌ యార్డు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్మించగా మున్సిపాలిటీకి ప్రత్యేక డంపింగ్‌ యార్డు లేదు. ఇటీవలే సెగ్రిగేషన్‌ షెడ్‌ను మున్సిపాలిటీకి ఇచ్చారు.

చెత్తబండి రావడం లేదు

మా కాలనీకి చెత్త బండి రెగ్యులర్‌గా రావడం లేదు. మూడు మాసాలుగా కాలనీలో ఊడ్వడం లేదు. మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పగిలిపోయి నాలుగేళ్లు కావస్తున్నా మరమ్మతు చేయడం లేదు. ఇప్పటికై నా అధికారులు తగు చర్యలు తీసుకోవాలి.

– గుండ ప్రమోద్‌, వాసవీనగర్‌

సిబ్బంది కొరత ఉంది

జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో సిబ్బంది కొరత ఉంది. ఇటీవలే సెగ్రిగేషన్‌ షెడ్‌ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి ఇచ్చారు. వర్మికంపోస్టు తయారీకి అవసరమున్న మిషనరీతో పాటు తడి, పొడి చెత్త సేకరణకు ప్రత్యేక వాహనాలు అవసరం. ముఖ్యంగా ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ డంపింగ్‌ యార్డునే వినియోగించుకుంటున్నాం. మున్సిపాలిటీకి ప్రత్యేక డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

– భుజంగరావు, మున్సిపల్‌ కమిషనర్‌

ఏదీ ‘చెత్త’శుద్ధి? 1
1/4

ఏదీ ‘చెత్త’శుద్ధి?

ఏదీ ‘చెత్త’శుద్ధి? 2
2/4

ఏదీ ‘చెత్త’శుద్ధి?

ఏదీ ‘చెత్త’శుద్ధి? 3
3/4

ఏదీ ‘చెత్త’శుద్ధి?

ఏదీ ‘చెత్త’శుద్ధి? 4
4/4

ఏదీ ‘చెత్త’శుద్ధి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement