● జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు
ఖమ్మంలీగల్: బాలల రక్షణలో ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎం.నాగరాజు సూచించారు. పోక్సో చట్టంపై అవగాహన కల్పించేందుకు ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’లో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలల ఉపాధ్యాయులకు శనివారం శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా జడ్జి ప్రారంభించి మాట్లాడుతూ బాలలతో ఉపాధ్యాయులు స్నేహపూర్వకంగా ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని తెలి పారు. అనంతరం బాలల హక్కులు, పోక్సో చట్టం, బాలల రక్షణ వ్యవస్థలు, చైల్డ్ హెల్ప్‌లైన్ సేవలు, లైంగిక వేధింపులను గుర్తింపు, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంపై జిల్లా బాలల పరిరక్షణ అధికారి విష్ణు వందన, ప్యానల్ న్యాయవాది పి.పద్మావతి శిక్షణ ఇచ్చా రు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.దేవీమానస, న్యాయాధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
‘కై ్లమేట్ కాంక్లేవ్’లో ఖమ్మంపాడు సర్పంచ్
మధిర: హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ‘తెలంగాణ కై ్లమేట్ కాంక్లేవ్’ సమావేశంలో మధిర మండలం ఖమ్మంపాడు సర్పంచ్ బట్టా అంజన్ బాబు పాల్గొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవాలనే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి సహా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ సమావేశంలో చర్చించారు. తాగు, సాగునీటి సమస్యకు పరిష్కారం, పంటలపై కరువు ప్రభావం, కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై చర్చించిన ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా 10 మంది సర్పంచ్‌లను ఎంపిక చేయగా ఉమ్మడి జిల్లా నుంచి అంజన్బాబుకు అవకాశం దక్కింది. ఈ సందర్భంగా నీటి పొదుపుకు సంబంధించి విస్తృత ప్రచారం చేయడంతో పాటు పంటల్లో డ్రిప్ విధానానికి 100 శాతం సబ్సిడీ అమలుచేయాలని, మెట్ట వరి సాగును ప్రోత్సహించాలని తన ప్రసంగంలో సూచించానని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పాలేరుకు చేరిన
సాగర్ జలాలు
కూసుమంచి: తాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేసి న జలాలు శనివారం పాలేరు రిజర్వాయర్‌కు చేరాయి. రిజర్వాయర్‌కు సాగర్ నుంచి 2,740 క్యూసెక్కుల నీరు చేరుతుంది. దీంతో నీటిమ ట్టం క్రమంగా పెరుగుతోంది. ఈమేరకు రిజ ర్వాయర్‌ను జలవనరుల శాఖ ఎస్ఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. తాగునీటి అవసరాల నిమి త్తమే సాగర్ నుంచి నీటిని విడుదల చేసినందు న, వృథా కాకుండా పర్యవేక్షించాలని తెలిపా రు. కాల్వవెంట గస్తీ నిర్వహిస్తూ ఎవరూ పొలా ల్లోకి మళ్లించకుండా చూడాలని సూచించారు.
ప్రశాంతంగా
నవోదయ ప్రవేశపరీక్ష
కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో వచ్చే విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు శనివారం పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని 11 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా దరఖాస్తు చేసుకున్న 2,228 మంది విద్యార్థులకు గాను 1,931 మంది హాజరయ్యారు. పలు కేంద్రాలను డీఈఓ వాసంతి, నవోదయ విద్యాలయ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ వెంకటరమణ పరిశీలించారు.
●కారేపల్లి: కారేపల్లి మోడల్ స్కూల్, జెడ్పీహెచ్ఎస్లో నవోదయ పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయగా, రెండు కేంద్రాల్లో 339 మంది విద్యార్థులకు గాను 315 మంది పరీక్షలకు హాజరయ్యారని ఎంఈఓ జయరాజు తెలిపారు. తొలిసారి కారేపల్లిలో నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయడంతో పెద్దసంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.


