రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి తరలిరావాలి | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి తరలిరావాలి

Nov 25 2026 12:26 AM | Updated on Nov 25 2026 12:26 AM

● డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ

ఖమ్మంమయూరిసెంటర్‌: పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యాన హైదరాబాద్‌లో గురువారం జరిగే రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి జిల్లా నుంచి పార్టీ శ్రేణులు తరలిరావాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్‌ కోరారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన అనుబంధ సంఘాలు, మండల, పట్టణ అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ..సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రివర్గం పాల్గొనే ర్యాలీలో జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు దొబ్బల సౌజన్య, వేజండ్ల సాయికుమార్‌, ఆసిఫ్‌ అలీ, సయ్యద్‌ గౌస్‌, మొక్క శేఖర్‌గౌడ్‌, బొడ్డు బొందయ్య, గ్రంథి ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

రేపు జిల్లా కేంద్రంలో రైతుల నిరసన

ఖమ్మంమయూరిసెంటర్‌: ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్‌తో సంయుక్త కిసాన్‌ మెర్చా పిలుపు మేరకు ఈనెల 26న జిల్లా కేంద్రాల్లో జరిగే రైతు ప్రదర్శనలు జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్‌ మెర్చా జిల్లా సమన్వయ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. ఖమ్మం సుందరయ్య భవన్‌లో మాదినేని రమేష్‌ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో బొంతు రాంబాబు, డి.రమేష్‌, కొల్లేటి నాగేశ్వరరావు, ఎస్‌.కే.ఖాసిం మాట్లాడుతూ 26వ తేదీన ఖమ్మం పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి జెడ్పీ సెంటర్‌ వరకు మోటార్‌ సైకిల్‌ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు మేరుగు సత్యనారాయణ, మలీదు నాగేశ్వరరావు, వాసిరెడ్డి ప్రసాద్‌, ప్రతాపనేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

చేపల్లో వ్యాధుల

నివారణపై శిక్షణ

కూసుమంచి: మంచినీటి వనరుల్లో పెంచే చేపలకు వచ్చే వ్యాధులు, నివారణకు మత్స్యకారులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో మంగళవారం అవగాహన సదస్సు ఏర్పాటుచేయగా ఖమ్మం, సూర్యాపేట జిల్లాల మత్స్యకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ శ్యాంప్రసాద్‌, శాస్త్రవేత్తలు రవీందర్‌, శాంతన్న, నాగరాజు, దివ్య మాట్లాడుతూ నీటి నాణ్యత పరీక్షలు, వ్యాధుల గుర్తింపు, నివారణపై అవగాహన కల్పించారు. అనంతరం వ్యాధుల గుర్తింపు, సలహాల కోసం రూపొందించిన యాప్‌ వినియోగాన్ని వివరించారు. ఆ తర్వాత శిక్షణకు హాజరైన మత్స్యరైతులకు సర్టిఫికెట్లు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement