బలమైన ప్రజా ఉద్యమాలను స్వాగతించాలి | - | Sakshi
Sakshi News home page

బలమైన ప్రజా ఉద్యమాలను స్వాగతించాలి

Nov 25 2026 12:26 AM | Updated on Nov 25 2026 12:26 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: పెట్టుబడిదారి విధానం ప్రజలు, వర్ధమాన ప్రపంచానికి భారంగా మారిన నేపథ్యాన వీటికి వ్యతిరేకంగా జరిగే ప్రజా ఉద్యమాలను స్వాగతించాలని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. ఖమ్మంలో మంగళవారం జరిగిన పార్టీ జిల్లా ప్లీనంలో ఆయన మాట్లాడారు. పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద విధానం మూడో ప్రపంచ దేశాలను దోచుకుంటుండగా.. ఆర్థిక సంక్షోభాలు, ఆపై ప్రజల తిరుగుబాటు మొదలైందని తెలిపారు. భారత్‌లో కూడా ప్రధాని మోదీ సామ్రాజ్యవాద విధానాలకు మద్దతు ఇస్తూ దేశ వనరులను బడా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. దేశంలో ధరలు, నిరుద్యోగం పెరిగి యువత నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలనే డిమాండ్‌తో వచ్చేనెల 29న మాస్‌లైన్‌ ఆధ్వర్యాన హైదరాబాద్‌లో చేపట్టే బహిరంగ సభను విజయవంతం చేయాలని రంగారావు కోరారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కెచ్చల రంగయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గోకినేపల్లి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి సీ.వై.పుల్లయ్య మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు గుర్రం అచ్చయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, ఆవుల అశోక్‌, రాజు, శిరోమణి, బందెల వెంకయ్య, ఏ.వెంకటరెడ్డి, ఆర్‌.శివలింగం, కె.రవి, ఝాన్సీ, ఎస్‌.కే.లాల్‌మియా, నాగేశ్వరరావు, ఆవుల మంగతాయి, గంటా శ్రీనివాసరావు, కె.శ్రీనివాస్‌, పి.శోభ, టి.హన్మంతరావు, బి.లాజరు, పృధ్వీ, ఎన్‌.ఆజాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement