2024 డీఎస్సీ ఉపాధ్యాయులను గుర్తించండి | - | Sakshi
Sakshi News home page

2024 డీఎస్సీ ఉపాధ్యాయులను గుర్తించండి

Nov 25 2026 12:26 AM | Updated on Nov 25 2026 12:26 AM

ఖమ్మం సహకారనగర్‌: డీఎస్సీ–2024 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు ప్రొబేషనరీ డిక్లరేషన్‌ పూర్తి చేసి రెండో వార్షిక ఇంక్రిమెంట్‌ మంజూరు చేయాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఖమ్మంలోని యూనియన్‌ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు షేక్‌ రంజాన్‌ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 డీఎస్పీ ఉపాధ్యాయుల విషయంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేసినా జిల్లాలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా డీఈఓ స్పందించాలని కోరారు. నాయకులు వెంకన్న, షమీ, వల్లంకొండ రాంబాబు, రాందాస్‌, నాగేశ్వరరావు, సురేష్‌, ఉద్దండ్‌, ప్రశాంతి, సుధాకర్‌ పాల్గొన్నారు.

కోడి పందేల స్థావరంపై దాడి

ఖమ్మంరూరల్‌: మండలంలోని కాచిరాజుగూడెం సమీప మామిడి తోటలో కోడి పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ సందర్భంగా పెనుబల్లి మండలం కందిమళ్లవారి బంజర గ్రామానికి చెందిన చల్లా వెంకటేశ్వర్లు, చల్లా ముత్యాలు, గంజా వెంకటేశ్వర్లు, తేరకా రాంబాబు, తాళ్లూరి తిరుపతిరావు, శివకృష్ణ, తేరకా గోపాలకృష్ణ, గుంజా శివాజీ పట్టుబడ్డారు. వీరి నుంచి రెండు కార్లు, ఏడు మోటార్‌ సైకిళ్లతో పాటు రూ.3 వేల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు రూరల్‌ సీఐ ముష్క రాజు తెలిపారు.

27, 28వ తేదీల్లో

క్రీడాకారుల ఎంపిక

భద్రాచలంటౌన్‌: రాష్ట్రస్థాయి పోటీలకు ఐటీడీఏ పరిధిలోని ఏడు డివిజన్లకు చెందిన క్రీడాకారుల ఎంపికకు ఈనెల 27, 28వ తేదీల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు పీఓ బి.రాహుల్‌ తెలిపారు. కిన్నెరసానిలోని ప్రభుత్వ గిరిజన మోడల్‌ క్రీడాపాఠశాల ప్రాంగణంలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈనెల 27న అండర్‌–17, 28న అండర్‌–14 బాలబాలికల విభాగాల్లో జట్ల ఎంపికకు పోటీలు నిర్వహించనుండగా, క్రీడాకారులు ఎలిజిబిలిటీ ఫారం, స్టడీ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డుతో హాజరుకావా లని సూచించారు. కాగా, క్రీడాకారుల వెంట పీఈటీలు, పీడీలు, కోచ్‌లు ఉండాలని పీఓ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement