ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మంలోని అంకుర ఆస్పత్రిని డీఎంహెచ్‌ఓ రామారావు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రికార్డులు, ల్యాబ్, స్కానింగ్ విభాగాలను పరిశీలించి, అందుతున్న వైద్యసేవలు ఆరా తీశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆస్పత్రి నిర్వహణ ఉండాలని, అన్ని రికార్డుల్లో వివరాలను నమోదు చేయాలని సూచించారు. తనిఖీలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
నేలకొండపల్లిలో డీసీహెచ్‌ఓ..
నేలకొండపల్లి: స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి కె.రాజశేఖర్‌గౌడ్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, ల్యాబ్‌లో పరిశీలించాక ఫార్మసీలో మందు లభ్యతపై ఆరా తీశారు. అలాగే, చికిత్స పొందుతున్న వారితో మాట్లాడాక వైద్యసేవలపై వైద్యులు, సిబ్బందికి సూచనలు చేశారు.


