వైరా: రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా బాలబాలికల ఆర్చరీ జట్ల ఎంపిక పోటీలు వైరాలో ఆదివారం నిర్వహించారు. కిన్నెరసాని, కాచనపల్లి క్రీడా పాఠశాలలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి 65మంది బాలబాలికలు హాజరుకాగా పోటీలను మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ, ఎస్‌ఐ పుష్పాల రామారావు, ఆర్చరీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా శంకరయ్య, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మురళీకృష్ణ పాల్గొని ప్రారంభించారు. ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, వైరా ఏసీపీ సారంగపాణి చొరవతో వైరాలో పోటీలు నిర్వహించడం అభినందనయమని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన 18మందితో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్లను ఎంపిక చేశారు.


