చుంచుపల్లి/రుద్రంపూర్: హైదరాబాద్ రీజినల్ ఆఫీస్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్ వరుణ్ విజయ్ గురువారం చుంచుపల్లి మండలం పెనగడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ధన్‌బాద్–2 ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. పీహెచ్‌సీల్లో నిర్వహిస్తున్న రిజిస్టర్లు, ఫార్మసీ స్టోర్, ఐఎల్‌ఆర్, వైద్య రికార్డులు, ఇతర పరిపాలనా రికా ర్డులను పరిశీలించారు. సేవల నిర్వహణ, మందుల నిల్వ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను సమీక్షించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశా రు. రామవరంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను తనిఖీ చేశారు. బాధితులకు అఅందుతున్న సేవలపై ఆరా తీశారు. మేనేజర్ శృతి, హెల్త్ ఎడ్యుకేటర్ రాంప్రసాద్, సిబ్బంది సరిత, శంకరమ్మ, శ్రీనివాస్‌రావు, స్పందన, స్ఫూర్తి పాల్గొన్నారు.


