ఇది సులువుగా వరి నాట్లు వేసేందుకు ఉపయోగపడే యంత్రం. రెండు లీటర్ల పెట్రోల్‌తో ఎకరం పొలంలో నాట్లు పూర్తవుతాయి. ఆరు వరుసలుగా రోజుకు 3 – 4 ఎకరాల వరకు నాట్లు వేసుకోవచ్చు. రాలో కంపెనీకి చెందిన ఈ యంత్రానికి తెలంగాణలో స్టేషన్ ఘన్‌పూర్, బీబీనగర్‌లో డీలర్లు ఉండగా.. రైతులు ఆసక్తిగా వివరాలు ఆరా తీశారు.
ఈ పరికరాలతో సెల్‌ఫోన్ ద్వారా వ్యవసాయ విద్యుత్ మోటార్‌ను కంట్రోల్ చేయొచ్చు. ఇందులో ఆటో, మాన్యువల్, టైం మోడ్ సౌకర్యం కూడా ఉంది. అధిక లేదా లో ఓల్టేజీ వచ్చినప్పుడు మోటార్ కాలిపోకుండా నియంత్రిస్తుంది. బావి, బోరులో నీళ్లు అయిపోతే ఆటోమేటిక్‌గా మోటార్ ఆఫ్ చేసే సౌకర్యంతో రైతులకు పని సులువు కానుంది.


