కొండంత అండ | - | Sakshi
Sakshi News home page

కొండంత అండ

Jan 11 2026 7:44 AM | Updated on Jan 11 2026 7:44 AM

కొండం

కొండంత అండ

ఏడాది క్రితం శంకుస్థాపన.. నిరంతరం పర్యవేక్షణ

మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవతో రికార్డు సమయంలో పూర్తి ఈనెల 13న ప్రారంభం.. తొలిదశలో 36 చెరువులకు సాగర్‌ జలాలు

పథకాన్ని పరిశీలించిన ఎస్‌ఈ

ఇండియన్‌

ప్యారడైజ్‌ ఫ్లై క్యాచర్‌

రూ.66కోట్ల అంచనాలతో...

మండల వ్యాప్తంగా 64 చెరువులకు సాగర్‌ జలాలు అందాలనే లక్ష్యంతో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. తొలుత రూ.66కోట్ల అంచనాలతో ప్రణాళిక రూపొందించినా అన్ని చెరువులకు నీరు అందడానికి పైపులైను విస్తరణ తప్పనిసరి కావడంతో రూ.100 కోట్లకు చేరాయి. ప్రస్తుతం రూ.66 కోట్లతో పూర్తయిన మొదటి దశ పనులను ప్రారంభిస్తే 36 చెరువులకు నీరు అందనుంది. ఇక మండలంలో చిట్టచివరన అత్యధికశాతం గిరిజనులు ఉన్న పంగిడి వైపు మరో 18 కిలోమీటర్ల పైప్‌లైన్‌ నిర్మాణానికి రూ.34 కోట్లు విడుదలైతే ఇంకొన్ని చెరువులకు నీరు చేరుతుంది. ప్రస్తుతం తొమ్మిది కిలోమీటర్ల ప్రధాన పైప్‌లైన్‌ పనులు పూర్తికాగా, మంచుగొండ వద్ద డెలివరీ పాయింట్‌ ఏర్పాటుచేసి అక్కడి నుంచి గ్రావిటీ విధానంలో 25 కి.మీ. పైప్‌లైన్‌తో చెరువులకు నీరు అందించనున్నారు. ఐదు పైపులైన్ల ద్వారా సాగే ఈ నీటితో తొలి దశలో 2,400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. కాగా, వీ.వీ.పాలెం వద్ద సాగర్‌ ప్రధాన కాల్వ నుంచి ఒక్కో మోటార్‌ ద్వారా 13 క్యూసెక్కుల చొప్పున మూడింటి ద్వారా 39 క్యూసెక్కుల నీటిని పైపులైన్లు ద్వారా చెరువులకు తరలించనున్నారు. ఈ పథకం ప్రారంభంతో మండలంలోని రైతులకు సాగునీటి సమస్యలు తీరడమే కాక భూగర్భజలాలు పెరుగుతాయని, తద్వారా బోర్లు, బావుల ద్వారా పంటలు సాగు చేసుకోవచ్చని చెబుతున్నారు.

సరైన సాగునీటి వనరులు లేక ఇబ్బంది

పడుతున్న రఘునాథపాలెం మండల

రైతుల చిరకాల స్వప్నం నెరవేరుతోంది. ఖమ్మం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించి మండలంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రూపొందించిన మంచుకొండ ఎత్తిపోతల పథకం పూర్తయింది. ఈ పథకాన్ని మంత్రి 13వ తేదీన ప్రారంభించనుండగా.. తొలిదశలో మండలంలోని 36చెరువులకు సాగర్‌ జలాలు చేరనున్నాయి. తద్వారా

ఆయకట్టుకు నీరు అందడమే కాక భూగర్భ జలాలు మెరుగుపడతాయని చెబుతున్నారు.

– రఘునాథపాలెం

ఖమ్మం నుంచి గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గంలోని ఏకై క గ్రామీణ మండలమైన రఘునాథపాలెంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈమేరకు వీ.వీ.పాలెం మీదుగా సాగే సాగర్‌ ప్రధాన కాల్వపై ఎత్తిపోతల పథకం నిర్మాణానికి నిర్ణయించారు. మంచుకొండ ఎత్తిపోతల పథకం పేరిట ఈ పథకం నిర్మాణానికి శంకుస్థాపన చేశాక మంత్రి నిరంతరం పర్యవేక్షిస్తూ నిధులు మంజూరు చేయించడంతో రికార్డు సమయంలో పూర్తయింది. పనులు ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే మెయిన్‌ పైప్‌లైన్‌ నిర్మాణం పూర్తి చేయడమే కాక తాత్కాలిక మోటార్లతో ట్రయల్‌ రన్‌ కూడా విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం సబ్‌స్టేషన్‌ నిర్మాణం పూర్తవడంతో మూడు మోటార్లు ఏర్పాటు చేయగా నీటి సరఫరాకు పథకం పూర్తిస్థాయిలో సిద్ధమైంది.

సిద్ధమైన మంచుకొండ ఎత్తిపోతల పథకం

మండలంలోని మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ఈనెల 13న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనుండడంతో జలవనరుల శాఖ ఎస్‌ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు శనివారం పరిశీలించారు. వీవీపాలెం వద్ద ఉన్న పంప్‌హౌస్‌, మోటార్లు, సబ్‌స్టేషన్‌, మంచుకొండలో డెలివరీ పాయింట్‌ను పరిశీలించిన ఆయన ఇంజనీర్లకు సూచనలు చేశారు. శాఖ అధికారులు అనన్య, ఈలు ఝాన్సీ, ఉదయ్‌ప్రతాప్‌ పాల్గొన్నారు.

కొండంత అండ1
1/2

కొండంత అండ

కొండంత అండ2
2/2

కొండంత అండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement