హెచ్‌డబ్ల్యూవోస్ ఫోరం ఆధ్వర్యాన ముగ్గుల పోటీలు
ప్రతిభ చూపిన పలువురు మహిళలు
విజేతలకు బహుమతుల అందజేత
ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ హాస్టల్స్ వెల్ఫేర్ ఆఫీసర్ల (టీహెచ్‌డబ్ల్యూవో) ఫోరం ఆధ్వర్యాన శనివారం ఖమ్మంలోని ఎన్‌ఎస్పీ క్యాంపు ఎస్సీ బాలుర కాంప్లెక్స్ వసతిగృహం ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఫోరం అధ్యక్షుడు కోటపాటి రుక్మారావు ఆధ్వర్యాన జరిగిన ఈ పోటీల్లో జిల్లాలోని మహిళా వసతిగృహ సంక్షేమ అధికారులు పాల్గొనగా విజేతలకు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సంక్షేమంలో హెచ్‌డబ్ల్యూవోలది కీలకపాత్ర అని తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్, హెచ్‌డబ్ల్యూవోల ఫోరం బాధ్యులు ఎర్ర రమేశ్, లలితకుమారి, తాళ్లూరి శ్రీకాంత్, రాధికారెడ్డి, మృదుల, ఎన్.విజయ, ఎన్.నాగేశ్వరరావు, ఎం.కోమలి, సీహెచ్.నాగమణి, పి.మాధురి, సరస్వతి, అస్రపు నిషాబేగం, సునీత, వరలక్ష్మి, వినోద, పూలన్‌దేవి, అనీపూన్, శ్రీలత, శివ, స్టాలిన్, కరుణాకర్, నరేశ్, శ్రీనుబాబు, సిబ్బంది అంజమ్మ, తిరుపతిరావు, అజారుద్దీన్, నరేశ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


