నేడే తుది పోరు
జాతీయ స్థాయి కబడ్డీ టోర్నీలో సెమీస్‌కు చేరిన తెలంగాణ,
హరియాణా, యూపీ
టోర్నీ నుంచి నిష్క్రమించిన ఏపీ
చిరుజల్లులతో నిలిచిన
రాజస్థాన్ – కర్ణాటక మ్యాచ్
పినపాక: మండలంలోని ఈ–బయ్యారంలో జరుగుతున్న జాతీయస్థాయి అండర్–17 కబడ్డీ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. శనివారం ప్రీ క్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించారు. ఆయా మ్యాచ్‌ల్లో జట్లు హోరాహోరీగా పోటీపడగా తెలంగాణ, హరియాణా, ఉత్తరప్రదేశ్ జట్లు సెమీస్‌కు చేరాయి. ఆదివారం సెమీఫైనల్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌తో తెలంగాణ తలపడనుంది. కాగా, క్వార్టర్ ఫైనల్స్‌లో ఉత్తరప్రదేశ్ చేతిలో ఓడిన ఆంధ్రప్రదేశ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
చిరుజల్లులతో నిలిచిన ఆట
క్వార్టర్ ఫైనల్స్‌లో కర్ణాటక – రాజస్థాన్ జట్లు తలపడాల్సి ఉంది. అయితే, ఆ సమయాన చిన్నపాటి వర్షం జల్లు పడడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆదివారం ఉదయం ఈ రెండు జట్ల నడుమ క్వార్టర్ ఫైనల్స్ నిర్వహించి గెలిచిన జట్టుతో హరియాణా జట్టుకు సెమీఫైనల్స్ నిర్వహిస్తారు. ఈ రెండింటిలో గెలిచిన జట్టుకు యూపీ – తెలంగాణ మధ్య జరిగే సెమీస్‌లో విజేతతో ఫైనల్స్ నిర్వహించాకవిజేత ఎవరో తేలనుంది.
ఒక్క పాయింట్‌తో సెమీస్‌కు దూరం
క్రీడల్లో ఒక్క పాయింట్ కూడా ఎంత ముఖ్యమో కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది. అదే పరిస్థితి శని వారం తమిళనాడు జట్టుకు ఎదురైంది. హరి యాణా – తమిళనాడు జట్లు క్వార్టర్స్‌లో హోరాహోరీగా తలపడ్డాయి. తమిళనాడు 50 పాయింట్లు చేయగా హరియాణా 51 పాయింట్లు సాధించడంతో సెమీస్ కు దూసుకెళ్లింది. ఒక్క పాయింట్ తేడాతో ఓడిన తమిళనాడు సెమీస్ అవకాశాలు దూరం చేసుకున్నట్లయింది. కాగా, టోర్నీ తుది దశకు చేరడంతో అభిమానులు తెలంగాణ జట్టుకు ఈలలు, కేకలతో మద్దతు తెలుపుతున్నారు. కాగా, పంజాబ్‌పై గెలిచి సెమీస్‌కు చేరిన తెలంగాణ జట్టు క్రీడాకారులు సంబురాలు చేసుకున్నారు.
నేడే తుది పోరు


