యూరియా కోసం బారులు
బోనకల్: మండలంలోని రావినూతల పీఏసీఎస్ వద్ద యూరియా కోసం శుక్రవారం అన్నదాతలు బారులుదీరారు. సొసైటీ పరిధిలో రావినూతల, ఆళ్లపాడు గ్రామాల రైతులు యూరియా కోసం వచ్చారు. అయితే, 440 బస్తాల యూరియా మాత్రమే ఉండడంతో కూపన్ల ఆధారంగా పంపిణీ చేసిన అధికారులు, మిగతా వారికి శనివారం ఇస్తామని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు.
ఎల్‌ఐజీ ప్లాట్ల
లాటరీ వాయిదా
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం శ్రీరాంనగర్‌లోని ఎల్‌ఐజీ ప్లాట్ల కేటాయింపునకు శనివారం డ్రా తీయాల్సి ఉండగా, వాయిదా వేసినట్లు హౌసింగ్ బోర్డు సీఈ జీవీ.రమణారెడ్డి తెలిపారు. ఇక్కడ ప్లాట్ల కోసం 23 మంది దరఖాస్తు చేసుకోగా అందరికీ ప్లాట్లు కేటాయించనున్నా నంబర్ మాత్రం లాటరీ ద్వారానే ఖరారు చేస్తామని పేర్కొన్నారు.
● ఎల్‌ఐజీ ప్లాట్లు – విల్లాల మధ్య అక్రమంగా నిర్మించిన గోడ, గేటును హౌసింగ్ బోర్డు ఈఈ అంకమరావు ఆధ్వర్యాన రెవెన్యూ ఉద్యోగులు శుక్రవారం కూల్చివేశారు. ప్లాట్ల డ్రా ప్రక్రియకు ఆటంకం కలిగించేలా ఈ గోడ నిర్మించినట్లు భావిస్తున్నారు. తహసీల్దార్ సై దులు, ఉద్యోగులు సత్యనారాయణ, పృథ్వీరా జ్,రమేష్‌నాయక్, విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు.


