బెటాలియన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
● రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క
సత్తుపల్లిటౌన్: బెటాలియన్ ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డీజీపీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. సత్తుపల్లి మండలం గంగారం 15వ ప్రత్యేక బెటాలియన్‌లో జరుగుతున్న వార్షిక క్రీడాపోటీలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి విజేతలకు బహుమతులు అందజేశాక మంత్రి మాట్లాడారు. ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసుకుని వస్తే పదోన్నతులు, బదిలీలు, ఇతర సమస్యలపై చర్చిస్తామని తెలిపారు. పోలీసులు మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని మంత్రి సూచించారు. పూర్వీకులు ప్రకృతి సహజసిద్ధంగా లభించే కల్లు, ఇప్పసారా తాగినా ఆరోగ్యంగా ఉండేవారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వసుంధర యాదవ్, బెటాలియన్ కమాండెంట్ పెద్దబాబు, ఉద్యోగులు పాల్గొన్నారు.
విద్యుత్ శాఖ పోటీల్లో
విజేతగా ఖమ్మం జట్టు
ఖమ్మంవ్యవసాయం: ఇటీవల నల్లగొండలో జరిగిన విద్యుత్ శాఖ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో ఖమ్మం జిల్లా జటు విజేతగా నిలిచింది. జిల్లా జట్టు రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలవడం ఇది ఐదోసారి కావడం విశే షం. ఈ సందర్భంగా జట్టు క్రీడాకారులను ఖమ్మం, కొత్తగూడెం ఎస్‌ఈలు ఇనుగుర్తి శ్రీనివాసాచారి, మహేందర్, డీఈ బాబూరావు తదితరులు అభినందించారు.
వెంకట్రామిరెడ్డికి
ఉత్తమ రైతు పురస్కారం
ఎర్రుపాలెం: సేంద్రియ వ్యవసాయంతో ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పి స్తున్న మండలంలోని మీనవోలుకు చెందిన రైతు కుడుముల వెంకట్రామిరెడ్డికి పురస్కారం లభించింది. ఏపీలోని గుంటూరు జిల్లా విజ్ఞాన్ విశ్వవిద్యాలయం, రైతు నేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యాన శుక్రవారం వడ్లమూడిలోని విజ్ఞాన్ విద్యాలయంలో పలువురు రైతులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఐసీఐఆర్ డైరెక్టర్ చెరుకూరి శ్రీనివాసరావు, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా వెంకట్రామి రెడ్డి పురస్కారం అందుకున్నారు .
పాఠశాలకు రూ.2లక్షల విలువైన సామగ్రి
పెనుబల్లి: మండలంలోని కొత్తకాయిగూడెం ఎంపీయూపీఎస్‌కు ఎన్‌ఓఎస్‌జీహెచ్ ల్యాబ్ అధినేత సత్యనారాయణరెడ్డి రూ.2లక్షల విలువైన సామగ్రి సమకూర్చారు. ఇందులో ఎస్ టైప్ కుర్చీలు, టీచర్ టేబుళ్లు, డెస్క్ బెంచీలు ఉండగా వీటిని శుక్రవారం ఎంఈఓ కావేటి మోహన్‌రావు ప్రారంభించారు. సర్పంచ్ కాలసాని తిరుపతమ్మ, మాజీ సర్పంచ్ దొడ్డపునేని శ్రీదేవి, హెచ్‌ఎం కంకటి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆరోగ్యవంతమైన
సమాజం కోసమే యాత్ర
నేలకొండపల్లి: ప్రతీ ఒక్కరు ఆరోగ్యంగా ఉండేలా అవగాహన కల్పించేందుకు చిన్న జీయర్‌స్వామి సుఫలా యాత్ర చేపడుతున్నారని సిద్ధార్థ యోగా విద్యాలయం నిర్వాహకుడు ప్రకృతి వైద్యుడు రామచందర్‌రావు తెలిపారు. నేలకొండపల్లిలోని విద్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో జీయర్ స్వామి చేపట్టే యాత్ర ఈనెల 20న భక్తరామదాసు జన్మస్థలమైన నేలకొండపల్లిలో మొదలవుతుందని పేర్కొన్నారు. రైతులు, ప్రజల సంక్షేమం, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే కాక భూమాతను రక్షించుకోవడంపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. కాగా, యాత్ర సందర్భంగా 20వ తేదీన విద్యాలయంలో పాతకాలపు వ్యవసాయ పరికరాలు, దేశవాళీ 150రకాల పప్పు దినుసులు, 12 రకాల వరి బియ్యం, 50 రకాల చేతి వృత్తులు, 250 రకాల ఔషధ ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. ఈ యాత్రలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అర్చక సంఘం నాయకుడు తుపురాణి మధుసూధనాచార్యులు తదితరులు ఉన్నారు.
బెటాలియన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
బెటాలియన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం


