సీసీఐ కేంద్రంలో అగ్ని ప్రమాదం
సుమారు 20క్వింటాళ్ల పత్తి దగ్ధం
బేళ్లు, సీడ్లకు నిప్పు అంటుకోకపోవడంతో తప్పిన ముప్పు
కారేపల్లి: కారేపల్లిలోని శ్రీలక్ష్మిప్రియా కోటెక్స్ జిన్నింగ్ మిల్లులో కొనసాగుతున్న సీసీఐ పత్తి కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మిల్లు మిషనరీ నుంచి మొదలైన మంటలు పత్తికి అంటుకోగా ఆ ప్రాంతమంతా పొగ కమ్మేసింది. మిల్లు పక్కనే సుమారు వేయి క్వింటాళ్ల పత్తిపై నిప్పు రవ్వలు పడగా వర్కర్లు, సీసీఐ కేంద్రానికి వచ్చిన రైతులు పరుగులు తీశారు. ఇంతలోనే తేరుకుని పైపులతో నీళ్లు చల్లుతూ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇల్లెందు నుంచి అగ్నిమాపక శాఖ సిబ్బంది వాహనంతో వచ్చి మంటలను ఆర్పారు. అప్పటికే 20క్వింటాళ్ల పత్తి కాలిపోయినా రూ.కోటి విలువైన బేళ్లు, సీడ్లకు నిప్పు అంటుకోక పోవటంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. కాగా, పత్తిని బేళ్లుగా మార్చేందుకు శుభ్రం చేసే క్రమాన రాయి వంటివి వస్తే నిప్పు రవ్వలు వస్తాయని.. అది కన్వేయర్ బెల్ట్ వద్ద అంటుకోవడం ప్రమాదం కారణమై ఉండొచ్చని మిల్లు యజమాని రాహుల్ తెలిపారు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న మిషనరీ బెల్టుల వద్ద నుంచి పొగ రావడాన్ని గుర్తించిన వర్కర్లు అప్రమత్తం కావడంతో పెనుముప్పు తప్పినట్లయింది. ఘటనాస్థలాన్ని సింగరేణి తహసీల్దార్ రమేష్, ఎంపీఓ రవీంద్రప్రసాద్, గ్రామ కార్యదర్శులు కృష్ణవేణి, నెహ్రూ, సింగరేణి, సర్పంచ్‌లు మేదరి టోనీవీరప్రతాప్, దండు ప్రవీణ్ తదితరులు పరిశీలించారు.
సీసీఐ అధికారి ఆరా
ప్రమాదం జరిగిన మిల్లును సీసీఐ అధికారి గురురాజ్ కులకర్ణి పరిశీలించారు. ఇల్లెందు మార్కెట్ కార్యదర్శి నరేష్‌కుమార్‌తో కలిసి పరిశీలించిన ప్రమాదాలు వివరాలు తెలుసుకున్నాక మాట్లాడారు. ఒక ల్ రూ.25వేలు ఉంటుందని, అప్రమత్తం కావడంతో పెనుముప్పు తప్పిందని పేర్కొన్నారు. శుక్రవారం 145క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయగా, మిగతాది మిల్లు యజమాని నిల్వ చేసుకున్నాడని తెలిపారు.
సీసీఐ కేంద్రంలో అగ్ని ప్రమాదం


