ముగిసిన క్రీడాజ్యోతి ర్యాలీ
ఖమ్మం స్పోర్ట్స్/కల్లూరు/తల్లాడ/సత్తుపల్లిటౌన్/ వేంసూరు/కారేపల్లి: సీఎం కప్ క్రీడాపోటీలను పురస్కరించుకుని జిల్లాలో రెండురోజులుగా నిర్వహిస్తున్న క్రీడాజ్యోతి ర్యాలీ శుక్రవారం ముగిసింది. రెండో రోజు కొణిజర్ల, వైరా, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, ఏన్కూరు, కారేపల్లి, కామేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో కొనసాగిన ర్యాలీ సాయంత్రం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంకు చేరుకుంది. ఈ కార్యక్రమాల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్ మాట్లాడుతూ జిల్లా యువత క్రీడా పోటీల్లో ఉత్సాహంతా పాల్గొని సత్తా చాటాలని సూచించారు. డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 17నుంచి మొదలయ్యే పోటీల్లో పాల్గొనేందుకు అన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కోచ్‌లు ఎం.డీ.గౌస్, కె.క్రిస్టోఫర్‌బాబు, ఉదయ్‌కుమార్, ఆదర్శ్‌కుమార్, సాంబమూర్తి, బాగం నీరజాదేవి, ఆలకుంట నర్సింహారావు, పత్తిపాటి నివేదిత, పసుపులేటి వీరరాఘవయ్య, రాధాకృష్ణ, తులసి, అప్పారావు, పద్మ, మహేష్, సురేష్‌బాబు, బి.వెంకటేశ్, పకృద్దీన్, మాణిక్‌రావు, రాంమోహన్ రావు, నాగేశ్వరరావు, సత్యనారాయణ, రాజేశ్వరరావు, నాగేశ్వరరావు, సోందు, దుగ్గిరాల జయరాజు, యాకూబ్‌పాషా, మూర్తి, వెంకట్, లక్ష్మణ్, కృష్ణయ్య, విజయ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.


