ఆలయంలో జిల్లా జడ్జి పూజలు
ఖమ్మం అర్బన్: ఖమ్మం యూపీహెచ్‌కాలనీలోని స్వయంభూ శ్రీ అభయ వెంకటేశ్వర స్వామిని జిల్లా జడ్జి జి.రాజగోపాల్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికగా ప్రత్యేక పూజలు అనంతరం వేదాశీర్వచనం అందజేశారు. దేవస్థానం చైర్మన్ అల్లిక అంజయ్య, ప్రధాన కార్యదర్శి బెల్లికొండలరావు, కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డితో పాటు పల్లపు సత్యం, బొల్లి కొమరయ్య, మేకల వీరన్న, పురం తిరుపతయ్య, ఐతన బోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
అదనపు హాల్ నిర్మాణానికి శంకుస్థాపన
ఖమ్మం లీగల్: ఖమ్మం కోర్టులో మహిళా న్యాయవాదులకు ప్రస్తుతం ఉన్న బార్ అసోసియేషన్ సరిపోవడం లేదు. దీంతో ర్ అసోసియేషన్ బాధ్యుల విజ్ఞప్తితో జిల్లా జడ్జి జి.రాజగోపాల్ హైకోర్టుకు లేఖ రాయగా అనుమతులు మంజూరయ్యాయి. దీంతో అదనపు హాల్ నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ బాధ్యులు తొండపు వెంకటేశ్వరరావు, గద్దెల దిలీప్, విజయశాంత, ఇందిర, నరసింహారావు, కొల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


