జీపీఓల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ గ్రామ పాలన అధికారుల(జీపీఓ) యూనియన్ జిల్లా నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. ఖమ్మం టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఎన్నిక ఏకగ్రీవం కాగా, టీఎన్జీవోస్, ట్రెసా జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు, తుంబూరు సునీల్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారుమంచి శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. జీపీఓల యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా మన్నె గురుమూర్తి, ప్రధాన కార్యదర్శిగా చీమల వీరబాబు, కోశాధికారిగా షేక్ జమాల్, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అన్వర్ పాషా, బానోతు రవికుమార్, మహిళా అధ్యక్షురాలుగా మాటూరి మమత, తూమాటి శైలజ, అసోసియేట్ అధ్యక్షులుగా నెల్లూరి లవన్‌కుమార్ ఎన్నికయ్యారని తెలిపారు. ఈకార్యక్రమంలో నాయకులు జయపాల్, బొగ్గవరపు వెంకటేశ్వరరావు, కన్నేటి వీరవెంకటప్రసాద్, వసంత, షేక్ నాగుల్‌మీరా, శీలం వెంకటేశ్వర్లు, మలీద వెంకట్, అజీజ్ పాల్గొన్నారు.


