రోశిరెడ్డి మరణం పార్టీకి తీరని లోటు
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
బూర్గంపాడు: పీసీసీ మాజీ సభ్యుడు యడమకంటి రోశిరెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. నాగినేనిప్రోలులోని రోశిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో గురువారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి నివాళులర్పించాక ఆయన మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనుచరుడిగా భద్రాచలం, బూర్గంపాడులో పార్టీ అభివృద్ధికి కృషిచేశారని, దివంగత మంత్రి రాంరెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు.


