మహిళా న్యాయవాదులకు ముగ్గుల పోటీలు
ఖమ్మం లీగల్: రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా ఖమ్మం బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన మహిళా న్యాయవాదులకు గురువారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో న్యాయవాదులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రంగులతో రంగవల్లులను తీర్చిదిద్దారు. కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన పోటీల సందర్భంగా హరిదాసు ప్రదర్శన ఇవ్వగా, బార్ అసోసియేషన్ బాధ్యులు ఇందిర, విజయశాంత తదితరులు పండుగ వంటకాలు చేశారు. అనంతరం ముగ్గులను న్యాయమూర్తులు వెంపటి అపర్ణ, అర్చనాకుమారి, అఖిల, న్యాయవాది శ్రీలక్ష్మి పరిశీలించి బహుమతులు ప్రకటించారు. ఈమేరకు మంగ లక్ష్మి, ఉమారాణి, లలిత మొదటి మూడు స్థానాల్లో నిలవగా, పోలిశెట్టి పద్మావతి, ఆసియా, నజీమా, శృతి, స్వాతి ప్రత్యేక బహమతులు గెలుచుకున్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు తొండపు వెంకటేశ్వరరావు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా న్యాయవాదులకు ముగ్గుల పోటీలు


