సింథటిక్ మాంజా వినియోగిస్తే నేరం
ఖమ్మంవ్యవసాయం: సింథటిక్‌తో చేసిన మాంజాను జాతీయ హరిత ట్రిబ్యునల్, రాష్ట్రప్రభుత్వం నిషేధించినందున ఎవరైనా అమ్మినా, వినియోగించినా చర్యలు తీసుకోనున్నట్లు అటవీ శాఖ ప్రకటించింది. ఈమేరకు సమాచారం తెలియచేసేందుకు 08742–295323 నంబర్‌తో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశారు. ఈమేరకు అవగాహన కోసం రూపొందించిన పోస్టర్లను బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్‌తో కలిసి డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఆవిష్కరించారు. పర్యావరణం, పక్షులు, ప్రజల భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్న నిషేధిత నైలాన్ / సింథటిక్ మాంజా అమ్మినా, వినియోగించడం నేరమని పోస్టర్లను పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు, అటవీ అధికారులు పాల్గొన్నారు.


